చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం బూటకపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను నిలువునా మోసం చేసిందని టెక్కలి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ పేరాడ తిలక్ అన్నారు. సోమవారం నందిగాం పార్టీ కార్యాలయంలో టెక్కలి ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. తిలక్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల పక్షాన పని చేసేందుకు ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త ముందుకు రావాలని సూచించారు.