నందిగాం మండలంలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను మంత్రి ధర్మాన ప్రసాదరావు పరామర్శించారు. సోమవారం నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్, రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ తో కలిసి మృతుల కుటుంబాలను పరామర్శించారు. నందిగాంకు చెందిన కృష్ణస్వామి, నందిగాం గ్రామానికి చెందిన మనోజ్ కుమార్, ప్రభాకర్ రావు ఇటీవల మృతి చెందడంతో తీవ్ర సంతాపం వ్యక్తం చేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.