ఒడిస్సా రాష్ట్రం గంజాం జిల్లా సుర్లాం గ్రామానికి చెందిన నిండు గర్భిణీ పి జమునా రెడ్డి విశాఖ నుంచి ఇచ్చాపురం వెళ్లే ఆర్టీసీ బస్సు మంగళవారం సాయంత్రం ఎక్కింది. శ్రీకాకుళం దాటాక మార్గమధ్యలో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో అదే బస్సులో పలాస మండలం బ్రాహ్మణ తర్ల గ్రామానికి చెందిన సచివాలయ స్టాఫ్ నర్స్ వనజాక్షి ఆ బస్సులోనే నార్మల్ డెలివరీ చేసారు అనంతరం ఆసుపత్రికి తరలించారు.