టెక్కలి మేజర్ పంచాయతీ పరిధిలో శ్రీరామా కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. మురుగునీరు, వీధి మద్యలో ఉన్న ఖాళీ స్థలంలో చేరి పెద్ద మురికి కూపంలా తయారైంది. ఈ ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీచేసినా ఫలితం లేకుండా పోయింది. టెక్కలి రెవెన్యూ డివిజన్ అధికారి వారికి, పంచాయతీ యంత్రాంగానికి, మండలం అభివృద్ధి అధికారి వారికి ఎన్నో సార్లు ఫిర్యాదు చేసినా స్పందించడంలేదని కాలనీ వాసులు అంటున్నారు.