గజపతి జిల్లా రాయగడ సమితి దేవగిరి రేంజ్ అటవీ ప్రాంతంలోని కుములి సింగ్ పంచాయతీ ఐస్లాబర్ గ్రామ అటవీ ప్రాంతంలో ఆవు కళేబరం మంగళవారం లభించిన విషయం తెలిసిందే. పులి అడుగుజాడలను కనిపెట్టేందుకు అటవీశాఖ బృందం ఆ ప్రాంతంలో ఐదు ట్రాప్ కెమేరాలను అమర్చగా.. దింతో ఆవు కళేబరం తింటున్న దృశ్యాలు ట్రాప్ కెమేరాలో రికార్డు అయ్యాయి. ఆ దృశ్యాలను అధికారులు బుధవారం విడుదల చేశారు.