గార మండలం మొగదాలపాడు బీచ్ లో బుధవారం కనుమ పండగ సందర్భంగా పర్యాటకులు సందడి నెలకొంది. పండగ సమయంలో పరిసర ప్రాంతాల గ్రామాలకు వచ్చిన ప్రజలు, బంధువులతో బీచ్ కళకళలాడింది. బీచ్ కి వచ్చిన సందర్శకులు ఫోటోలు, వీడియోలు తీసుకొంటూ ఆనందిస్తుంటే, మరికొందరు సముద్రంలో స్నానం చేస్తూ కేరింతలు కొట్టారు.