హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మార్కాపురం, అనంతపురం.. ఇలా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలకు చివర్లో ఇలా బాద్ లేదా పురం అని కనిపిస్తుంటుంది. ఎందుకంటే పురం అంటే పట్టణమని అర్థం. ఈ అర్థంలోనే కొన్ని ఊళ్ల చివర పురం అన్న పదాన్ని వాడటం ప్రారంభమైంది. ఇక బాద్ అంటే నివాసం లేదా ఆహారం లభించే నివాసయోగ్యమైన స్థలమని అర్థం. వాటిని స్థాపించిన వారు లేదా ప్రముఖుల పేర్లకు చివర బాద్ పేరిట ప్రాంతాలను పిలుస్తున్నాం.