కాల్ మనీ వేధింపులపై కఠిన చర్యలు: హోంమంత్రి అనిత

85చూసినవారు
కాల్ మనీ వేధింపులపై కఠిన చర్యలు: హోంమంత్రి అనిత
కాల్ మనీ వేధింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. బుధవారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మతల్లిని దర్శించుకుని, దసరా ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో ఏలూరు కాల్ మనీ ఘటనపై ఆమె స్పందించారు. కిస్తీలకు ముందే వడ్డీకోత, సమయం దాటితే డబుల్ కిస్తీ పేరుతో చేసే కాల్ మనీ వ్యవహారంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక వడ్డీలు, అక్రమ వసూళ్ల పేరుతో అమాయకులను బలి చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు.

సంబంధిత పోస్ట్