AP: ఇంటర్ ఫలితాలు శనివారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫెయిల్ కావడంతో మరో విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. నంద్యాల జిల్లా బండి అత్మకూరుకి చెందిన మస్తాన్ అనే విద్యార్ధి నంద్యాల గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నాడు. శనివారం ఫలితాలు చూసుకోగా ఫెయిల్ అని రావడంతో మనస్థాపానికి గురైన మస్తాన్ ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి పెద్ద మౌలాలి ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.