భారీ ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరిన సుజనా చౌదరి

52చూసినవారు
భారీ ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరిన సుజనా చౌదరి
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న సుజనా చౌదరి నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీగా బయలుదేరారు. చిట్టినగర్ లోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ర్యాలీగా బయల్దేరారు. ప్రచార రథంపై దివంగత ఎన్టీఆర్ ఫొటోను ఉంచారు. కూటమికి చెందిన చాలామంది నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. సుజనా వెంట వంగవీటి రాధ, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా తదితర నేతలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్