ప్రస్తుతం ఏపీలో సోషల్ మీడియా పోస్టులు, వాటిలో అసభ్యకరమైన వ్యాఖ్యలు, వ్యక్తిత్వ హనానికి పాల్పడే కామెంట్లు, తప్పుడు కథనాలు రాస్తున్నవారిపై కేసులు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా టీడీపీ.. మాజీ సీఎం జగన్‌పై ఓ ఆరోపణ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. అందులో జగన్ పెన్నులు, పేపర్ల ఖర్చు రూ. 9.84 కోట్లు అని ఆరోపించింది. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని జగన్ ఏ ఆత్మకథలు రాశాడో, ఏ ప్రేతాత్మ ఆటో బయోగ్రఫీ రాశాడో, కట్టు కథలు ప్లాన్ చేశాడో తెలియదు అని క్యాప్షన్ ఇచ్చింది.