తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి విషయంలో కచ్చితంగా న్యాయం చేస్తానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్ర సీఎం, ఎంపీలు ఎవరూ విజ్ఞప్తులతో వచ్చినా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రిగా తనకు తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యే అవకాశం దక్కిందని అభిప్రాయపడ్డారు. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక అనుబంధం కొనసాగాలని ఆకాంక్షించారు.