AP: విశాఖ గ్రేటర్ మేయర్ పీఠంపై కూటమి పట్టు బిగిస్తోంది. మ్యాజిక్ ఫిగర్ చుట్టూ రాజకీయాలు వాడీవేడీగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనలోని 74వ వార్డు కార్పొరేటర్ వంశీరెడ్డి చేరనున్నట్లు సమాచారం. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాలతో కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత చూపుతున్నారు. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 74 మ్యాజిక్ ఫిగర్‌కు చేరాలి. ఇప్పటికే కూటమికి 70 మంది కార్పొరేటర్ల బలం ఉంది. దాంతో కూటమికి ఇది అగ్ని పరీక్షగా మారింది.