గతంలో వైసీపీ ప్రవేశపెట్టిన జీవో-24ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఒకటో తరగతిలో 25 శాతం పేద విద్యార్థులకు రిజర్వేషన్ ఇవ్వాలంటూ గత ప్రభుత్వం జారీ జీవో-24ను జారీ చేసింది. అమ్మఒడి పథకం అందిస్తుండటంతో 2023-24 సంవత్సరంలో పిల్లలను చేర్చుకోవాలని ఈ జీవో జారీ అయింది. అయితే దీనిపై విద్యాసంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. విద్యాహక్కు చట్టానికి భిన్నంగా ఉందంటూ మంగళవారం జీవోను హైకోర్టు కొట్టివేసింది.