కొత్త నీరు వచ్చినప్పుడు.. సహజంగానే పాత నీరు కొట్టుకుపోతుంది. ఇప్పుడు ఇలాంటి చిక్కే సీనియర్ మోస్ట్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు ఎదురవుతోందని అంటున్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాయకులు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఇప్పుడు యనమల మాటను ఎవరూ పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయన రానున్న రోజుల్లో రాజకీయాల నుంచి గౌరవంగా తప్పుకోవడమే మంచిదని భావిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.