అక్రమంగా పెయిన్ కిల్లర్స్ అమ్ముతున్న ఓ 30 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి పెయిన్ కిల్లర్స్, నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా కోర్టు పోలీస్ కస్టడీకి అప్పగించింది. పెయిన్ కిల్లర్స్ విక్రయించిన మహిళ మణిపూర్ వాసిగా పోలీసులు గుర్తించారు. చెన్నై పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె మణిపూర్‌లోని కుకీ తెగ సింఘాట్ ప్రాంతానికి చెందిన మహిళగా సమాచారం.