భారత్ - ఇంగ్లాండ్ మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రెండో మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే, రెండో టీ20 మ్యాచ్ ముందు భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ ప్రస్తుతం గాయపడినట్లు తెలుస్తోంది. మొదటి మ్యాచ్‌లో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన అతడు ప్రాక్టీస్ సెషన్ సమయంలో చీలమండ గాయంతో బాధపడినట్లు సమాచారం. అయితే, దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.