AP: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో పీజీ అడ్మిషన్లలో పెనాల్టీలు విధించటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. పీజీ కోర్సుల దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియడంతో రూ.20వేల పెనాల్టీని వైద్య విశ్వవిద్యాలయం ప్రతి విద్యార్థి నుంచి వసూలు చేయటంపై ఆక్షేపణలు వస్తున్నాయి.దరఖాస్తు ఫీజు కంటే పెనాల్టీ ఫీజు ఎక్కువ ఉండకూడదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా యూనివర్సిటీ పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.