AP: విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చి రాష్ట్రానికి వెలుగులు ఇచ్చి తాను అధికారం కోల్పోయినట్లు సీఎం చంద్రబాబు అన్నారు. 'ఐటీ తిండి పెడుతుందా? అని చాలా మంది ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు అదే ఐటీ ఎక్కడికో తీసుకువెళ్లిపోతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నాను. వెల్తీ, హెల్తీ ఫ్యామిలీనే నా గోల్. ఆర్థిక అసమానతలు తొలగించేందుకు నిరంతరం పని చేస్తాను' అని చంద్రబాబు తెలిపారు.