ఏపీలో ఉచిత బస్సు పథకంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మహిళలకు మూడు సిలిండర్లు, 64 లక్షల మందికి పింఛన్లు కూటమి ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. మరో రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలవుతుందని వెల్లడించారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయని అన్నారు. తిరుపతి జిల్లాలోని శ్రీసిటీని అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.