పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండటంతో ఈ మూవీ వాయిదా పడుతోంది. అయితే తాజాగా ఓ వార్త సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. టిల్లులో హీరోయిన్‌గా నటించిన రాధిక అలియాస్ నేహా శెట్టి ఓజీలో స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.