పొలాల్లోకి దూసుకెళ్లిన వ్యాన్.. వ్యక్తి మృతి

83చూసినవారు
పొలాల్లోకి దూసుకెళ్లిన వ్యాన్.. వ్యక్తి మృతి
ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జి.కొండూరులోని పెట్రోల్ బంకు వద్ద వ్యాన్ టైర్లు పేలి వాహనం పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కలకోటి ప్రవీణ్ (36) అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మంగళగిరికి చెందిన కలపాల ప్రసాదరావు, దూరు ఇర్మీయా, మృతుడు కలకోటి ప్రవీణ్ గేదెల వ్యాపారం చేస్తుంటారు. తిరువూరులో గేదెలు కొనుగోలు చేసి మంగళగిరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్