AP: కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని, వారిని విధుల్లో కొనసాగించాలని ఏపీ గ్రామ, వార్డు వాలంటీర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి డిమాండ్ చేశారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ.. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడమే కాకుండా రూ.10 వేల వేతనం ఇస్తామని, బకాయిలు చెల్లిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఇప్పుడు నోరు మెదపకపోవడం విచారకరమన్నారు. రాష్ట్రంలో 2.60 లక్షల మంది వాలంటీర్లు రోడ్డున పడ్డారని వాపోయారు.