ఏపీలోని కాకినాడ జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళ దినోత్సవంగా సందర్భంగా మహిళ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాల్ని నిర్వహిస్తుంటారు. దీంతో మహిళ ఉద్యోగులు మార్చి 5, 6న జరిగే వివిధ ఆటల పోటీల్లో పాల్గొనేందుకు వెసులు బాటు కల్పిస్తూ.. రెండు రోజుల పాటు స్పెషల్ క్యాజువల్ లీవ్ లను మంజురు చేస్తు ఉత్తర్వులిచ్చారు. మిగతా జిల్లాల్లోనూ సెలవులు ఇవ్వాలని మహిళలు కోరుతున్నారు.