స్పోర్ట్స్ బైక్స్‌లో రైడర్ ముందుకు వంగి ఉండటం వల్ల నడుముపై ఒత్తిడి పెరుగుతుంది. డిస్క్‌లపై అధిక భారం వేస్తుంది. క్రూయిజర్ బైక్స్‌లో రైడర్ వెనక్కి వంగి కూర్చోవడం వల్ల నడుము పంపులో మార్పు వస్తుంది. మోటోక్రాస్ బైక్స్ నడపడం వల్ల శరీరం నిరంతరం కదులుతూ, జంపింగ్ వల్ల నడుము కండరాలపై అధిక భారం వేస్తుంది. మీ శరీరానికి సరిపోయే బైక్‌ను ఎంచుకోండి. ఎక్కువసేపు బైక్ నడపకుండా మధ్యమధ్యలో విరామం తీసుకోండి.