AP: పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) స్పష్టత ఇచ్చింది. ప్రాజెక్టులో రెండు దశలు లేవని తేల్చిచెప్పింది. ‘‘2021-23 మధ్య చెల్లింపులను రెండుగా చేయాలని రాష్ట్రం కోరింది. నిధుల రియంబర్స్మెంట్కు ప్రాజెక్టును రెండుగా విభజించాలని కేంద్రాన్ని కోరింది. కేంద్రం సిఫారసుతోనే జలశక్తి కార్యదర్శి తొలి ఫేజ్ కింద నిధులు ఆమోదించారు. దీనివల్ల ప్రాజెక్టులో ఫేజ్ అనేది తెరపైకి వచ్చింది’ అని తెలిపింది.