AP: విజయవాడలోని ఇందిరాగాంధీ క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన 35వ పుస్తక మహోత్సవాన్ని గురువారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రచయిత బిభూతి భూషన్ బంధోపాధ్యాయ వనవాసి, అక్షర సత్యం అమృతం, చివుకుల పురుషోత్తం రాసిన ఏదిపాపం?, నాని పాల్ఖివాలా రాసిన we the nation, we the people పుస్తకాలు అంటే తనకి ఇష్టమని పేర్కొన్నారు. ఇవే కాకుండా ఇంకా ఎన్నో పుస్తకాలు ఉన్నాయని వాటి గురించి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా చెబుతానని అన్నారు.