ఉత్తరాఖండ్‌లోని భిలాంగనా ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. ద్వారి థాప్లా గ్రామంలో చలిమంట కారణంగా ఊపిరాడక దంపతులు మృతి చెందారు. మోహన్ సెమ్‌వాల్ (52), యశోదా దేవి (48) గ్రామంలో ఓ పెళ్లికి హాజరయ్యారు. రాత్రి చలిగా ఉండటంతో మంట వేసుకుని గదిలో దంపతులు నిద్రపోయారు. ప్రమాదకర వాయువు వెలువడటంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. తెల్లవారుజామున ఈ విషయం వెలుగులోకి వచ్చింది.