NTR 29వ వర్థంతి సందర్భంగా ఆయనకు మంత్రి నారా లోకేశ్ ఘన నివాళులర్పించారు. ‘ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు.. ప్రభంజనం. అదొక సంచలనం. తెలుగువాడి విశ్వరూపం. వెండితెరపై రారాజుగా వెలుగొందారు, రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారు. తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలిచారు. సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లని నినదించారు. కోట్లాది హృదయాల్లో కొలువైన మా తాతగారే నాకు నిత్యస్ఫూర్తి’ అని లోకేశ్ ట్విట్టర్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.