ఏపీ ఎన్నికల్లో జనసేన తరపున గెలుపొంది మంత్రులుగా కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ బాధ్యతలు చేపట్టారు. సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న కందులు దుర్గేష్, పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్‌లు ఇద్దరూ కూడా దూకుడుగా పనిచేస్తున్నారనేది పార్టీ వర్గాల అభిప్రాయం. పవన్‌ను పక్కన పెడితే జనసేన మంత్రుల పనితీరు పీక్స్‌లో ఉందన్న టాక్ వినిపిస్తోంది.