AP: ఢిల్లీ పరిణామాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 'సున్నిత అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాలి. మంచి ఉద్దేశంతో మాట్లాడినా చెడుగా ప్రచారం చేసేవారు ఉంటారు. గతంలో వ్యవసాయం దండగ అని అనుకున్నా.. అన్నట్లు ప్రచారం చేశారు. కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్‌కు తగిన గౌరవం లభించలేదు. అంబేద్కర్ ఓడిపోయింది కూడా కాంగ్రెస్ హయాంలోనే' అని మంత్రులతో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.