టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. భార్య, పిల్లలతో కలిసి త్వరలో లండన్‌లో స్థిరపడతాడని తెలిసింది. రిటైర్మెంట్ తర్వాత తన మిగిలిన జీవితాన్ని యూకేలో గడపాలనుకుంటున్నాడట. ఈ విషయాన్ని కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ వెల్లడించారు. కోహ్లీ, అనుష్క దంపతుల కుమారుడు అకాయ్ ఈ ఏడాది ఫిబ్రవరి 15న లండన్‌లోనే జన్మించాడు. కోహ్లీ కుటుంబం ఈ ఏడాది ఎక్కువ కాలం లండన్‌లో ఉన్నారు. అక్కడ కోహ్లీకి ఆస్తులు కూడా ఉన్నాయి.