AP: జనవరిలో రాజధాని అమరావతి పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. ఈ పనులకు ఈ నెల 22 నుంచి టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. హడ్కో రుణంతో చేపట్టే పనులు సంక్రాంతికి మొదలవుతాయని తెలిపారు. అలాగే వరల్డ్ బ్యాంక్ నిధులతో చేసే పనులు ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ వెల్లడించారు.