తనలాంటి విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఇలాగే ఉంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమారపురంలో పవన్ మాట్లాడుతూ.. "6 నెలల పాలన పూర్తయింది. మీరు నన్ను నమ్మి గెలిపించారు.. నిలబెట్టి పనిచేయిస్తాను. ఒళ్లు వంచి పని చేసిన తర్వాతే ఓట్లు అడుగుతాను. అధికార యంత్రాంగం సహకారం కావాలి. పిఠాపురం నుంచి జిల్లాల పర్యటన మొదలుపెడుతా. నాయకులను కలుపుకొని వెళ్తాను. విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఇలాగే ఉంటుంది." అని అన్నారు.