ఏపీలోని ఏలూరు జిల్లాలో ఉన్న ఓ ఆలయాన్ని సందర్శిస్తే తప్పనిసరిగా సంతానం కలుగుతుందట. కార్తీక మాసంలో కామవరపుకోట మండలంలోని గుంటుపల్లి గుహలో ఉన్న శివుడి విగ్రహం ముందు 3వ సోమవారం నాడు మహిళలు రాత్రి పూట నిద్ర చేస్తారు. ఆ సమయంలో పిల్లలు ఆడుకునే బొమ్మలు లేదా వస్తువులు కలలో కనిపిస్తే తప్పక సంతాన భాగ్యం కలుగుతుందట. ఇంకా పశ్చిమగోదావరి జిల్లాలోని శివదేవుని చిక్కాల గ్రామంలో శివరాత్రి రోజు కొబ్బరి మొక్క లేదంటే గులాబి మొక్క నాటితే సంతాన భాగ్యం కలుగుతుందట.