చంద్రగిరి: అక్రమ నిర్మాణాలు కూల్చిన రెవెన్యూ అధికారులు

79చూసినవారు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఇందిరమ్మ కాలనీలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు మంగళవారం సాయంత్రం చర్యలు చేపట్టారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి అనధికార నిర్మాణాలు చేపడుతున్న 3 భవనాలను జేసీబీతో నేలమట్టం చేశారు. అలాగే మరికొన్ని భవనాలకు నోటీసులు జారీ చేశారు. ఎవరైనా అక్రమంగా భవన నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్