రాజ్యసభలో ఈనెల 17న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురించి హేళన చేసి మాట్లాడిన అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. దేశంలో అన్ని పార్టీలు కలిసి నియంతలా వ్యవహరిస్తున్న అమిత్ షా తీరుపై స్పందించాలని కోరారు.