ఎస్ ఆర్ పురం మండలంలోని తయ్యూరు పాయకట్టు ఇలవేల్పు ఆరిమాని గంగమ్మ ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వెంకట చలపతి ఆచార్యులు, భక్తులు పాల్గొన్నారు.