అధికారంలోకి రాగానే గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం గూడూరు లోని సి. ఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో జరిగిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఈ హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా కేంద్రానికి వెళ్ళడం ప్రజలకు చాలా ఇబ్బంది ఉందని ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ తెలపడంతో ఆయన ఈ హామీ ఇచ్చారు.