వరి పొలాలను సందర్శించిన పలువురు అధికారులు

76చూసినవారు
వరి పొలాలను సందర్శించిన పలువురు అధికారులు
ఇందుకూరుపేట మండలంలోని పాములవారిపాలెంలో గల వరి రైతు పొలాలను పలువురు అధికారులు శుక్రవారం సందర్శించారు. కొత్తగా వచ్చిన నానోయూరియా ప్లస్ 20% ద్రవరూప ఎరువును పంటల పైన రైతులచేత పిచికారి చేయించారు. గతంలో నానో యూరియా 4 శాతం నత్రజని కలిగి ఉండేదని, ఇప్పుడొచ్చిన నానో యూరియా ప్లస్ 20శాతం నత్రజని కలిగి ఉంటుందని స్థానిక రైతులకు వివరించారు. ఇలాంటి ద్రవ రూపంలో ఉన్న ఎరువులు రైతులు వాడటం అలవాటు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్