కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు శుద్ధ జలాలు అందిస్తూ మూతపడిన ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్లాంట్లను పునః ప్రాంభించాలంటూ ప్రజలు కోరుతున్నారు. ఈ మేరకు క్లస్టర్ ఇన్ ఛార్జ్ సత్యేంద్ర శేఖర్, ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ కు వినతి పత్రం అందజేశారు. కొత్తపేట, డీకేపల్లి, మోడల్ కాలనీలో ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్లాంట్లను మరమ్మతులు చేపట్టి నీళ్లు అందించాలని సత్యేంద్ర శేఖర్ కోరారు.