కుప్పం: నాటుసారా సీజ్
కుప్పం మండలం నారామానుకొట్టాలు గ్రామానికి చెందిన విజయ, చిన్నఓబు గ్రామానికి చెందిన ఒక మహిళ వద్ద నుంచి అక్రమంగా నిల్వ ఉంచిన 12 లీటర్ల నాటుసారా సీజ్ చేసి వారిని రిమాండ్ కు తరలించినట్లు ఎక్సైజ్ సీఐ నాగరాజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో అక్రమంగా సారా, గంజాయి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.