కుప్పం: ఎం.ఆర్. పి ధరకే మద్యం విక్రయాలు: ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్

51చూసినవారు
కుప్పం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో మద్యం షాపుల యజమానులతో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయ్ శేఖర్ సమావేశం అయ్యారు. ఆయన మాట్లాడుతూ, మద్యం పాలసీలో భాగంగా యజమానులకు లైసెన్సులు ఇవ్వడం జరుగుతోందని మంగళవారం తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మద్యం షాపులు నిర్వహించాలని, ఎంఆర్పి ధరకే మద్యం విక్రయించాలని సూచించారు. బెల్ట్ షాపులకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని, బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్