కుప్పం మండల పరిధిలో సంచరిస్తున్న ఒంటరి మదపుటేనుగులు పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఎస్ఆర్డి జయశంకర్ గురువారం పేర్కొన్నారు. తమిళనాడు వైపు నుంచి వచ్చిన ఒంటరి ఏనుగు కుప్పం మండలంలోని నడుమూరు, నూలుకుంట అటవీ ప్రాంతం గుండా నాయనూరు అటవీ ప్రాంతంలో సంచరిస్తుందని అన్నారు. అర్ధరాత్రి ఒంటరి ఏనుగును ట్రాకర్స్ సాయంతో ఫారెస్టు సిబ్బంది అటవీ ప్రాంతంలోకి మళ్లించారు.