తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే బీసీలకు రాజకీయ ప్రాధాన్యత లభించిందని, సీఎం చంద్రబాబు బీసీల పక్షపాతి అని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సోమవారం పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతికి అనేక సంస్కరణలతో పాటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఈ వ్యాఖ్యలు చేశారు.