శాంతిపురం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం వేడిగా ఉంది. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం పడింది. ఒక్కసారిగా వర్షం పడటంతో ప్రజలు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం ధాటికి రోడ్లు జలమయమయ్యాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.