Oct 16, 2024, 07:10 IST/
కొండా సురేఖకు షాక్.. రేపు ఢిల్లీకి వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
Oct 16, 2024, 07:10 IST
మంత్రి కొండా సురేఖ, వరంగల్ జిల్లా ఎమ్మెల్యేల మధ్య వివాదం ముదరుతోంది. కొండా సురేఖ వర్గం తమను ఇబ్బంది పెడుతోందని ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యలోనే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు సురేఖపై ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా రేపు ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ ను కలిసి ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయనున్నారు. దీంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలే మంత్రిని వ్యతిరేకిస్తుండటం ఆసక్తిగా మారింది.