టౌన్ హాల్ ఏర్పాటుపై సమీక్షించిన పలమనేరు ఎమ్మెల్యే
పలమనేరు పట్టణంలో టౌన్ హాల్ ఏర్పాటు అంశంపై శాసనసభ్యుడు అమరనాథ్ రెడ్డి సోమవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. గతంలో మంత్రిగా పనిచేసిన ఆయన 2018లో మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులను మంజూరు చేయించారు. గత ప్రభుత్వ హయాంలో ఆ పనులు అడుగైనా ముందుకు పడలేదు. దీంతో తిరిగి ఆ పనులను చేపట్టి మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే సమీక్షించారు.