చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం భక్తులు పోటెత్తారు. భక్తులు భారీగా రావడంతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో పెంచల కిషోర్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.