పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం తిరునపల్లికి చెందిన ఏ. దాక్షాయని సోమవారం కలెక్టర్ సుమిత్ కుమార్ ను కలిశారు. తన స్వగ్రామంలో గడిచిన 30 సంవత్సరాలుగా తన అధీనంలో ఉన్న 1. 50 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నానని చెప్పారు. ప్రభుత్వం వారు దయతో తనకు పట్టాదారు పాసు పుస్తకాన్ని మంజూరు చేయాలని కలెక్టర్ ను కోరారు. పరిశీలించి చర్యలు తీసుకోవాలని చౌడేపల్లి మండల తహశీల్దాన్ ను కలెక్టర్ ఆదేశించారు.